మరో పాక్ అధికారి బహిష్కరణ
గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై ఇటీవల ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ అధికారిని కేంద్రం బవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అధికారి తీరు పైనా భారత్ అగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను దేశం నుంచి బహిష్కరించిన కేంద్రం.. 24 గంటల్లోగా భారత్ ను వీడి వెళ్లాలని డెడ్ లైన్ విధించింది. సదరు అధికారి తన హోదాకు తగని రీతిలో వ్యవహరించనందున చర్యలు తీసుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.