రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన

News Published On : Wednesday, June 4, 2025 11:00 AM

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్ లో ఉద్యోగాల రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అక్కడి ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల అంశంపై అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది. లద్దాఫ్లోని ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకే ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది.