ఆసుపత్రిలో చేరిన యాంకర్ రష్మి
టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజి బిజీగా ఉండే ప్రముఖ నటి రష్మి గౌతమ్ మరోసారి అనారోగ్యం పాలైంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. 'గత కొన్ని రోజులుగా నా హెల్త్ ఏమీ బాగుండడం లేదు. ఉన్నట్లుండి విపరీతంగా రక్త స్రావం, ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి అంతా సెట్ అయ్యాక మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాను' అంటూ రాసుకొచ్చింది.