ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఏపీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్షణికావేశంలో నేరాలు చేసి రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో మగ్గుతున్న వారికి శుభవార్త చెప్పింది.