DSC అభ్యర్థులకు అలర్ట్..
మెగా డీఎస్సీ దరఖాస్తులకు వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఒకే దరఖాస్తులో తమ అర్హతలకు సంబంధించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.
అంతేకాకుండా ఒకే పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణలకు వీలులేదని పేర్కొన్నారు.