Airtel కీలక ప్రకటన
టెలికాం దిగ్గజ సంస్థ Airtel కీలక ప్రకటన చేసింది. 2022లో 5జీ స్పెక్ట్రమ్ వేలంలో 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను అదానీ డేటా నెట్వర్క్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వినియోగ హక్కులను పొందుతామని ఎయిర్టెల్ ప్రకటన చేసింది. దీంతో అదానీ డేటా నెట్వర్క్స్ కు చెందిన స్పెక్ట్రమ్ ను ఎయిర్టెల్ వినియోగించే మార్గం సుగమం అయ్యింది. ఎయిర్టెల్ 5జీ సేవల విస్తరణకు ఇది కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.