పాకిస్తాన్ లో తగలబడుతోన్న ఎయిర్పోర్ట్
పాకిస్తాన్ లోని లాహోర్ అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్తాన్ ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుందని విమానాశ్రయ సిబ్బంది వర్గాలు తెలిపాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ సంఘటన కారణంగా, రన్వేను తాత్కాలికంగా మూసివేశారు.