విజయవాడలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

News Published On : Friday, April 3, 2020 07:36 AM

విజయవాడలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌ నమోదవటంతో అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన కుటుంబంగా అధికారులు చెప్పారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో మొత్తం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెళ్లడించారు. చిట్టినగర్‌లో ఢిల్లీ నుంచి 13 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నంలో 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చిన 130 మందిని క్వారంటైన్‌కు పంపించారు.

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 477 కొత్త కేసులు నమోదయ్యాయని , 17 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఢిల్లీ లోనే  141,  ఆంధ్రప్రదేశ్ లో 38, తెలంగాణాలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి,  కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2275 కాగా మరణాల సంఖ్య 72 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూదాము.

మహారాష్ట్ర :423

కేరళ : 286

ఢిల్లీ : 293

తమిళనాడు : 309

కర్ణాటక : 124

తెలంగాణ :154

ఆంధ్రప్రదేశ్ :149