జియో యూజర్లకు శుభవార్త

News Published On : Thursday, March 14, 2019 12:39 PM

భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయెన్స్ జియో తమ కస్టమర్లకు ఎప్పుటికప్పుడు కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. కస్టమర్లు అవసరాలు మరియు అభిరుచికి అనుగుణంగా రకరకాల ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఇంటర్నెట్ వాడకందారులు అధికమవుతున్న తరుణంలో అధిక డేటా ఉండేలా ప్లాన్లను డిజైన్ చేశారు. అందులో రోజుకు 2జీబీ డేటా ప్లాన్స్ ప్రత్యేకం, వీటి ధరలు రూ. 198 నుండి రూ. 498 మధ్య ఉన్నాయి మరియు వీటి వ్యాలిడిటీ 28 రోజుల నుండి 91 రోజుల వరకు ఉన్నాయి. అయితే అవసరానికి తగ్గట్లుగా ఏయే ప్లాన్ ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి..

రూ.198 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 28 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

రూ.398 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.398 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 70రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

రూ.448 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.448 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 84రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

రూ.498 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.498 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 91రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.