త్వరలో 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 14 వేలు, ఇంజనీర్ల పోస్టులు 2 వేలు, గ్రూప్ 3, గ్రూప్లో 1000, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7 వేల జీపీవో పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం.