భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి
చైనాలో విషాద ఘటన చోటు చేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్ లోని ఓ రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.