నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలో 18 నోటిఫికేషన్లు
ఏపిలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీపై ఏపీపీఎస్సీ దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. నెల రోజుల్లో రోస్టర్ పాయింట్ల ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు అగ్రికల్చర్, రవాణా, మున్సిపల్, జైళ్లు తదితర శాఖల్లో ఖాళీలున్నాయి.