పొట్లకాయతో కోడిగుడ్డు కలిపి తీసుకుంటే...?

Lifestyle Published On : Thursday, December 6, 2018 10:00 PM

మ‌న రోజూవారీ ఆహార‌పుటలవాట్ల‌పై అనేక అనుమానాలుంటాయి. రెండు ప‌దార్థాలు క‌లిపి తీసుకుంటే విష‌మ‌యం అవుతుంద‌నే అభిప్రాయాలున్నాయి. అయితే శాస్త్రీయంగా వాటికి గల కార‌ణాలు ప‌రిశీలిస్తే ఎంతో ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో పొట్లకాయ మరియు కోడిగుడ్డు కాంబినేషన్ ఒకటి.

రెండు పదార్థాలు కలిపి ఆహారంగా తీసుకునేటప్పుడు రెండూ ఒకే విధంగా, ఒకే సమయంలో జీర్ణమయ్యేలా ఉండాలి. అలా కాకుండా ఒకటి త్వరగా జీర్ణమై, రెండవది ఆలస్యంగా అయితే జీర్ణమైతే జీర్ణ సమస్యలు మొదలవుతాయి. తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకపోతే, వ్యాధి కారకమైన ఆమ్లాలు తయారయ్యి అనారోగ్యాలు వస్తాయి.

పొట్లకాయ విషయానికి వస్తే, పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన తేలిగ్గా అరిగిపోతుంది. కోడిగుడ్డులో మాంసకృత్తులు ఎక్కువగా ఉండటంతో ఆలస్యంగా జీర్ణమవుతుంది. అలాంటప్పుడు రెండింటినీ కలపడం వల్ల అరిగే సమయంలో తేడాలొస్తాయి. దీంతో ఆమ్లాలు తయారయ్యే అవకాశాలు ఎక్కువ. ఆ ఆమ్లాలు జీర్ణాశయంలో పేరుకుంటే జీర్ణాయశయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. పొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తీసుకోకూడదు అనడానికి గల ప్రధాన కారణం ఇదే. దీనికి అనేక అభూత‌క‌ల్ప‌న‌లు తోడుకావ‌డంతో కొంద‌రు