నేడు అక్షయ తృతీయ.. ఈ రోజు ఇలా చేస్తే..
హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానముంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. అయితే ఈరోజు ఇల్లు శుభ్రపరుచుకుని ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేస్తే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కరుణిస్తుందని అంటారు. తులసి నీటిని సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.