ఈ గింజలతో అదిరే ప్రయోజనాలు
వేసవిలో చెమట, జిడ్డు కారణంగా పలు చర్మ సమస్యలు వస్తుంటాయి. పొద్దుతిరుగుడు గింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలతో స్క్రబ్ తయారుచేసుకుని ఉపయోగిస్తే చర్మం శుభ్రపడుతుంది. ఈ గింజల పొడికి పాలు, పసుపు కలిపి ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఇలా చేస్తే పొడి చర్మం సమస్య దూరమవుతుంది. చర్మం రంగు మెరుగుపడుతుంది.