చికెన్ తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Lifestyle Published On : Sunday, May 4, 2025 06:56 AM

చికెన్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. ఇవి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు దారితీయవచ్చు. చికెన్ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

చికెన్, పాలు లేదా పెరుగు కలిపితే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. చికెన్ రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, పండ్లను కలిపి తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. చికెన్ తిన్న వెంటనే కాఫీ తాగే కాఫీలో ఉండే టానిన్లు, చికెన్ లోని ఖనిజాలతో చర్య జరిపి జీవి నుండి జింక్ విసర్జనకు దారితీస్తుంది. చికెన్ సరిగ్గా ఉడికించకపోతే, బాక్టీరియా, వైరస్ల ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ ను బాగా ఉండికించి తినండి. చికెన్ ను మితంగా తింటే, ఇతర ప్రోటీన్ మూలాలను కూడా ఆహారంలో చేర్చుకుంటే, ఆరోగ్యానికి మంచిది. చికెన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలను పరిగణనలోకి తీసుకొని, ఆహారంలో చికెన్ ను మితంగా తీసుకోవడం మంచిది.