మీరు తినే ముక్క మంచిదేనా...!
చాలా ప్రాంతాల్లో మాంసం విక్రయదారులు నిబంధనలు పాటించడం లేదు. జీవాలు ఆరోగ్యకరమైనవా కాదా అని పరీక్షించకుండానే ఇష్టారాజ్యంగా వధిస్తూ మాంసం విక్రయాలు చేపడుతున్నారు. వధశాలలో జీవాలను వధించి పరిశుభ్రమైన ప్రాంతాల్లో విక్రయించాల్సి ఉన్నప్పటికీ అలాంటిదేమీ పాటించడం లేదు. మరికొందరు మాంసం దుకాణాలను రోడ్లపై, మురికి కాలువల పక్కన, దుమ్ము ధూళి, అపరిశుభ్రమైన వాతావరణంలో అమ్మకాలు చేస్తున్నారు.