ఇవి తిన్నారంటే మీ కిడ్నీలు పాడైపోతాయి..
మన శరీరంలో కిడ్నీలు ప్రధాన భూమిక పోషిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కిడ్నీలు కీలకంగా పని చేస్తాయి. కానీ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. సాసేజ్ లు, బేకన్, సాలామీ వంటి మాంసంలను వాటిని రసాయనాలు కలిపి ఎక్కువ కాలం నిల్వ చేస్తారు. వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.