కార్బైడ్ తో పండిన మామిడిని ఇలా గుర్తించండి..
వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మామిడి పండ్లను తినేవాళ్లు ఆ మామిడి పండ్లు సహజసిద్ధంగా పండినవా లేక కృత్రిమ రసాయన కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్బెట్ తో పండించిన మామిడి పండ్లు ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. రసాయనాలతో పండించిన మామిడి పండ్లు మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి.
కార్బైడ్ తో పండించిన మామిడిపండ్లు మొత్తం ఒకే రంగులో, అక్కడక్కడ ఆకుపచ్చని, నల్లని మచ్చలతో ఉంటుంది. అదే సహజసిద్ధంగా పండిన పండు కాస్త ఎరుపు, పసుపు రంగు కలిసిన మిక్స్డ్ కలర్లో కనిపిస్తుంది. సహజంగా పండిన మామిడిపండ్లను నొక్కితే చాలా సాఫ్ట్ గా, పండిన వాసనతో కమ్మగా అనిపిస్తుంది. కార్బైడ్ తో పండిన మామిడిపండు అంత సాఫ్ట్ గా ఉండదు. ఆ పండు వాసన కూడా రాదు. నేచురల్ పండు తినడానికి కూడా తియ్యగా ఉంటుంది. పులుపు అసలే ఉండదు. సహజంగా పండిన మామిడి పండులో రసం ఎక్కువగా వస్తుంది. తినడానికి చాలా స్వీట్ గా ఉంటుంది. కార్బైడ్ తో పండిన మామిడి పండ్లు పెద్దగా రసం రాదు. అలాగే అంత స్వీట్ గా కూడా ఉండదు. పండు రంగును, పండు స్వభావాన్ని చూసే కార్బైడ్ తో పండిందా? లేక న్యాచురల్ గా పండిందా అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి మామిడి పండ్లు తినేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని నాచురల్ పండ్లని ఎంపిక చేసుకొని తినండి.