నిద్ర లేచిన వెంటనే ఇలా చేయండి..
ఆరోగ్యకరమైన పానీయంతో రోజు ప్రారంభించడం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అలాంటి పానీయాలలో ఒకటి కలబంద రసం. ఆయుర్వేద మూలిక కలబంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద రసం ఖాళీ కడుపుతో తాగితే శరీరాన్ని ఉత్తేజ పరచి, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలో అలసట, తలనొప్పి, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం మొదలైన సమస్యలను నివారిస్తుంది.