అల్లం-మిర్చీ కాంబినేషన్ తీసుకుంటే క్యాన్యర్ పరార్!

Lifestyle Published On : Wednesday, January 23, 2019 04:54 PM

మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్లు,క్యాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పోషక విలువలు ఉండేలా చూసుకుంటాం.

అయితే అల్లం, మిరపకాయలు తింటే మాత్రం కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సంగతి గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. అయితే అవి పూర్తిగా నిజం కావు అంటున్నారు అమెరికా పరిశోధకులు. ప్రతిరోజూ అల్లం, పచ్చిమిరపకాయలను ఆహారం ద్వారా తీసుకున్నట్లయితే కొన్ని రకాల కేన్సర్లు దూరం చేసుకోవచ్చన్న విషయం కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు ఎలుకల మీద పరిశోధనలు నిర్వహించారు. కొన్ని నెలల పాటు ఎలుకలకు అల్లం, పచ్చిమిరపకాయలు ఉన్న ఆహారం ఇచ్చి అనంతరం వాటిని పరిశీలించారు. క్యాన్సర్‍ వచ్చే అవకాశం 20 శాతం తగ్గినట్లు వీరు గమనించారు.