కిడ్నీ ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Lifestyle Published On : Wednesday, July 31, 2019 04:02 PM

ఇప్పుడు ఉన్న లివింగ్ స్టైల్ వలన కిడ్నీల్లో రాళ్లు రావటం ఎక్కువ అయింది. చాలామంది కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నారు అని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తినటం, సమయానికి తినకపోవడం, నీరు సరిగా తాగకపోవడం, వ్యాయామం చేయకపోవటం , స్ధూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. ఒక్కసారి కిడ్నీ స్టోన్స్‌ వచ్చిన వారికి తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందువల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూదాం.

డీ హైడ్రేషన్‌ వల్ల వేసవిలో కిడ్నీస్టోన్స్‌ వస్తాయి, దీనికి మీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి. 

పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, పల్చటి మజ్జిగ ఎక్కువగా తాగాలి.

నిమ్మరసం రాళ్లు ఏర్పడకుండాకాపాడుతుంది. 

భోజనంతో పాటు నిమ్మరసం తీసుకోవడం. 

కమలా జ్యూసు తీసుకోవడం ఉపయోగకరం.

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తినకండి.

వేసవిలో శాకాహారం తీసుకోవడం చాలా మంచిది .

పాలకూర, టీ, సాఫ్ట్‌ డ్రింక్స్‌, బీట్‌రూట్‌ వీటివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

రాత్రి మొత్తం మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని పరగడుపున త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.

అరటిచెట్టు బెరడును జ్యూస్‌ త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగి పోతాయి.

కొత్తిమీర జ్యూస్‌ ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.