ఉడకపెట్టిన గుడ్డును ఎప్పుడు తినాలో తెలుసా..

Lifestyle Published On : Tuesday, May 13, 2025 06:55 AM

ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. అయితే ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడానికి ఒక టైమ్ ఉంటుంది. మీరు ఎప్పుడో ఎగ్ బాయిల్ చేసి అన్ని పనులు అయ్యాక ఏ గంటకో రెండు గంటలకో తిందాం అనుకుంటే తప్పే. ఉడకబెట్టిన గుడ్లను వెంటనే తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆలస్యం చేస్తే గుడ్లు గాలికి ప్రభావితం అవుతాయని, గాలిలో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు గుడ్లపై వ్యాప్తి చెందుతాయని అంటున్నారు.