ఉదయం లేవగానే ఇలా చేయండి..
ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కొన్నింటిని పాటిస్తే రోజంతా హుషారుగా ఉండవచ్చు. ఈ మేరకు ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్ చదవండి. తర్వాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకొని నవ్వండి. కుదిరితే పక్కనున్న వారికి గుడ్మార్నింగ్ చెప్పండి. ఇది మీ మూడ్ ను రోజంతా ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది.