పొద్దున్నే టీ తాగుతున్నారా..
ఖాళీ కడుపుతో టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అది డైజెస్టివ్ సిస్టమ్పై ప్రభావం చూపుతుందని తెలిపారుటీలోని కెఫీన్, టానిన్లు గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తుంది. పాలతో కలిపిన టీ దీన్ని మరింత పెంచుతుంది. ఇది గుండె సమస్యకు కారణమవుతుంది. టీ తాగడానికి కంటే ముందు గోరువెచ్చని నీళ్ళు కానీ స్నాక్స్ కానీ తీసుకోవడం మంచిది.