రాత్రి పూట ఎక్కువ సేపు మేల్కొంటున్నారా..?
రాత్రి పూట ఎక్కువగా మేల్కొనే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలస్యంగా పడుకునే వారు, రాత్రి వేళ మేల్కొనే వారు అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయంతో బాధపడేవారికి ఎక్కువని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సరైన సమయానికి నిద్రించాలని సూచిస్తున్నారు.