నిద్రపోయే ముందు ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు
ప్రతి రోజు పడుకునే ముందు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల శరీరం, మనస్సుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి లోతైన నిద్రను ప్రోత్సహిస్తుంది. శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడంతో పాటు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ ఇలా చేస్తే ఆరోగ్యకరమైన నిద్ర, ప్రశాంతత, ఒత్తిడి నుంచి ఉపశమనం మనకి సహజంగా లభిస్తాయి.