కివీ పండుతో కలిగే లాభాలు

Lifestyle Published On : Tuesday, May 13, 2025 03:33 PM

ప్రతిరోజు ఒక కివీ పండును తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు కివీ పండులో విటమిన్ C, K పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు బలంగా ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తితో పాటు జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కివీ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే అందులో ఉండే పొటాషియం రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.