రోజూ దానిమ్మ తినడం మంచిదేనా?
ప్రతిరోజు దానిమ్మ పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాల ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల చర్మ కాంతి మెరుగుపడటమే కాకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణకు, గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్, పోషకాలు మలబద్దకాన్ని తగ్గించి జీర్ణ క్రియ వ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.