అరటిపండ్లు యొక్క పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు.

Lifestyle Published On : Friday, March 29, 2019 11:00 AM

మనం అరటి పండ్లు మీద నల్లటి మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. ఈవిధంగా నల్లటి మచ్చలు ఏర్పడి ఉంటే దానిని పండిన అరటి పండుగా గుర్తించబడుతుంది. ఈ నల్లటి మచ్చలు అధికంగా కనిపిస్తే ఖచ్చితంగా పారవేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ పండిన అరటి పండ్ల వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అరటి పండు బాగా పండిన తరువాత దానిలో ఉండే పోషక విలువల స్థాయిలు మారుతాయి. అంతేకానీ పోషక ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కోల్పోయిందని అర్థం కాదు. అరటి పండు పండినా కూడా మీ శరీరానికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీ వారు చెప్తున్నారు.

పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉండే సంక్లిష్ట పిండి పదార్థాలు పక్వానికి వచ్చే కొలదీ, స్టార్చ్ నుండి సాధారణ చక్కెరలవలె మార్పులకు గురవుతుంది. ఏదిఏమైనా క్యాలరీల సంఖ్య మాత్రం అదేవిధంగా ఉంటుంది. కానీ నీటిలో కరిగే స్వభావం ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు థయామిన్ వంటి విటమిన్లు తగ్గుదలకు గురవుతాయి.

వాస్తవానికి పండిన అరటి పండ్లుని ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఆహారంగా పరిగణించడం జరుగుతుంది. అరటి పండులో విటమిన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. బాగా పండిన అరటి పండులో టన్నుల కొద్దీ పోషకాలు ఉంటాయి. శరీరానికి సరైన జీవక్రియలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అరటి పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది 
  • గుండె మంటను తగ్గిస్తుంది
  • కణ నష్టాన్ని నివారిస్తుంది
  • రక్త హీనత సమస్యను నివారించడంలో
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • పొట్ట అల్సర్స్ తగ్గించడంలో మంచి పాత్ర పోషిస్తుంది
  • క్యాన్సర్ సమస్యను నివారిస్తుంది
  • శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది
  • మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది