హార్డ్ డిస్క్ మాయంపై మరోసారి స్పందించిన విష్ణు
ఇటీవల 'కన్నప్ప' చిత్రం హార్డ్ డిస్క్ మాయమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై నటుడు మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఇంకా అది తన చేతికి రాలేదని విష్ణు స్పష్టం చేశారు. కాగా ఈనెల 27న కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు విష్ణు మాట్లాడారు. ఇంత గొప్ప సినిమా చేశానంటే అది శివ లీల అని ఆయన పేర్కొన్నారు.