స్వరూపానంద సరస్వతిపై సింగర్ సునీత ఆగ్రహం..!

Entertainment Published On : Wednesday, June 12, 2019 03:31 PM

ప్రముఖ సినీగాయని సునీతను తనకు భక్తురాలుగా చెప్పుకున్నందుకు గాను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎప్పుడూ స్వరూపానంద సరస్వతి ఆశ్రమానికి వెళ్లలేదని, ఆయనతో తనకు పరిచయం లేదని, అయినా కూడా తన పేరు ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరూపానంద సరస్వతి వాడారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరూపానంద సరస్వతి ఇంటర్వ్యూ వీడియోను పోస్ట్ చేసిన సింగర్ సునీత రోజూ ఎన్నో వదంతులు వస్తుంటాయని కానీ, కొన్ని విషయాల గురించే స్పందించవలసిన అవసరం వస్తుందని సునీత అన్నారు. స్వరూపానంద సరస్వతి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు ఎందుకు చెప్పారో ఆశ్చర్యంగా ఉంది అంటూ పోస్ట్‌ చేశారు.

సునీత పోస్ట్ చేసిన వీడియోలో సినిమావాళ్లు ఎవరైనా మీ దగ్గరకి వస్తుంటారా? అని స్వరూపానంద సరస్వతిని అడగగా. చిరంజీవి, రజనీకాంత్ తనవద్దకు వస్తుంటారని, అదేవిధంగా గాయని సునీత కూడా వస్తుంటారని చెప్పారు. యూట్యూబ్‌లో ఈ ఇంటర్వ్యూ చూసిన సునీత ఫేస్‌బుక్‌ వేదికగా స్వరూపానంద సరస్వతి చెప్పిన మాటలను ఖండించారు.