పది కోట్లు ఇస్తామన్నా.. ఆ పనికి ఒప్పుకోని నాజూకు హీరోయిన్..

Entertainment Published On : Sunday, August 18, 2019 01:47 PM

ఒక ఆయుర్వేద సంస్థ వారి స్లిమ్మింగ్ పిల్‌ని ప్రమోట్ చేయడానికి యాడ్ కోసం శిల్పా శెట్టి ని సంప్రదించింది, యాడ్ కోసం పది కోట్ల రూపాయలను కూడా ఆఫర్ చేసారు, కానీ పది కోట్ల రూపాయల ఆఫర్‌ను బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తృణప్రాయంగా వదిలేసుకుంది. ఆఫర్ వదిలివేయడానికి గల కారణం తెలిసిన ఆమె అభిమానులు శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. వివరాలలోకి వెళితే ఇటీవల ఓ ఆయుర్వేద సంస్థ శిల్పాశెట్టిని సంప్రదించింది. తాము ఉత్పత్తి చేసే స్లిమ్మింగ్ పిల్కు ప్రచారకర్తగా ఉండాలని కోరింది. ఇందుకు సంబంధించిన ప్రకటనలో నటించాలంటూ పది కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. ఆ స్లిమ్మింగ్ పిల్‌ను వేసుకుంటే ఎటువంటి వ్యాయామాలు లేకుండానే పొట్టలోని కొవ్వు కరిగిపోయి సన్నగా, నాజూగ్గా తయారవుతారని చెప్పడమే ఆ ప్రకటన ఉద్దేశం.

ఆఫర్‌ను వదులుకోవడంపై శిల్ప మాట్లాడుతూ తనకు నమ్మకం లేని దాని గురించి తాను ప్రచారం చేయలేనని పేర్కొంది. తాను నమ్మని వస్తువును మరొకరితో కొనిపించలేనని చెప్పింది. ఆ పిల్ వేసుకుంటే తక్షణం ఫలితం కనిపిస్తుందని చెప్పడం ద్వారా ఆకర్షించవచ్చు. కానీ, నాకు వాటిపై నమ్మకం లేదు. అలాంటిది వేరొకరిని కొనమని ఎలా చెప్పగలను’’ అని శిల్ప చెప్పుకొచ్చింది.