నిర్మాతగా ఎన్నో తెలుసుకున్నాను: సమంత
హీరోయిన్ సమంత నిర్మాతగా తొలి సినిమా 'శుభం' మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత మీడియాతో మాట్లాడుతూ`రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం. ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నాను. ఎన్నో తెలుసుకున్నాను అనుభవంతోనే నిర్మాతగా మారాను. నేను ఈ సినిమా షూటింగ్స్ సమయంలో నిర్మాతగా ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాను. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు.