నాగార్జునతో శైలేష్ కొలను మరో క్రైమ్ జానర్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా దీని గురించి తెలియనప్పటికి ఒక రౌండ్ చర్చలు జరిగాయట. శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వెర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని నాగార్జున అడిగినట్లు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం శైలేష్ ఆయనకు చెప్పిన కథ కూడా క్రైమ్ జానరేనట. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నట్లు సమాచారం.