ఆలీపై ఘాటు విమర్శలు పవన్ కళ్యాణ్..!

Entertainment Published On : Tuesday, April 9, 2019 12:00 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్  ఇండస్ట్రీలో మంచి స్నేహితులన్న విషయం అందరికీ  తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆలీ జనసేన పార్టీలో చేరుతాడు అని అనుకున్నాము కానీ ఊహించని విధంగా వైసీపీలో చేరి ఆపార్టీ తరుఫున ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సోమవారం  ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఆలీపై ఘాటు విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

తన స్నేహితుడు అని ఆలీని నమ్మితే మోసం చేసి వెళ్ళిపోయాడని పవన్ దుయ్యబట్టారు, ఆలీ సూచించిన వ్యక్తికే నరసరావు పేట ఎంపీ టికెట్ ఇచ్చాను కానీ ఆలీ వైసీపీ కి ప్రచారం చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇదేనా స్నేహమంటే అని పవన్ ఆలీని ప్రశ్నించారు. ఆలీకి కష్టాలు వస్తే అండగా ఉన్నాను, ఆలీకి ఏదైనా అవసరం వస్తే  అండగా ఉన్నాను. ఐనా నన్ను వదిలివెళ్లిపోయాడని అన్నారు. అందుకే  నేను అభిమానులను తప్ప ఎవరినీ నమ్మను అని పవన్ అన్నారు.  నేను గెలవననే భయంతో ఆలీ వైసీపీ లో చేరి ఉంటాడని ఆయన అన్నారు, మనం గెలిచి ఆలీకి చూపించాలి అని అయన అన్నారు.