ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ
యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ నెల 11న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో యాంకర్ దీపిక హీరోయిన్ గా నటించింది.
ఓ పల్లెటూరిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఓ అమ్మాయి పుడుతుంది. తనే రాజకుమారి (దీపిక పిల్లి). తన రాకతో ఊరికి అదృష్టం పట్టిందని ఆమెను చాలా ప్రత్యేకంగా చూస్తారందరూ. ఆ అదృష్టం ఊరు దాటి పోకూడదని.. తన కంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. ఇందుకు రాజకుమారి తండ్రి అంగీకరిస్తాడు. దీంతో అపట్నుంచి ఆ 60 మంది అబ్బాయిలు.. చిన్నతనం నుంచే రాజకుమారి మనసు గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుంటారు. ఊరిలోకి బయటి అబ్బాయిలెవరినీ రానివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక ప్రాజెక్ట్ పని మీద వస్తాడు ఇంజినీర్ కృష్ణ (ప్రదీప్ మాచిరాజు). కొన్ని రోజులకు కృష్ణ-రాజకుమారి ప్రేమలో పడతారు. ఊర్లో వాళ్లకు విషయం తెలియకుండా దాచిపెట్టిన ఈ జంట.. తర్వాత అందరికీ దొరికిపోతుంది. మరి ఊరి కట్టుబాటును దాటి ఈ జంట ఎలా ఒక్కటైంది? ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది మిగతా కథ.