Breaking: ప్రముఖ దర్శకుడు కన్నుమూత
విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ ఎన్ కరుణ్ (73) కన్నుమూశారు. షాజీ ఎన్ కరుణ్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని తన నివాసంలో మరణించారు. కరుణ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.