నితిన్ తమ్ముడు సినిమా నుంచి హీరోయిన్ కొత్త లుక్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న మూవీ తమ్ముడు. ఈ సినిమాలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్ డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫొటో చూస్తుంటే గిరిజన యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.