క్రికెటర్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్
కన్నడ హీరోయిన్ అర్చన కొట్టిగె ఐపీఎల్ క్రికెటర్ శరత్ BRను పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన పలు కన్నడ సినిమాల్లో నటించింది. ఇక కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. గతేడాది ఐపీఎల్ లీగ్ గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.