హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుకలో రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు లెజెండరీ కాంతారావు అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అందిస్తూ ఉన్న ఫోటోను షేర్ చేసి దాని కింద ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. నేను సాధించే ప్రతి అవార్డు ముందు వారికే సొంతం. ఆ తర్వాత నన్ను ఆదరిస్తున్న వారికి దక్కుతుందని తెలిపాడు.