ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
లోకేశ్ ఆజిల్స్ దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'లెవన్'. ఈ ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.