Breaking: ప్రముఖ దర్శకుడు కన్నుమూత
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు పార్థో ఘోష్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. 100 డేస్, దలాల్, అగ్నిసాక్షి, గులాం-ఎ-ముస్తఫా, తీస్రా కౌన్? వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన మరణవార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.