దసరా కానుకగా "సైరా"

Entertainment Published On : Saturday, February 2, 2019 02:00 PM

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నయన తార, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే, షూటింగ్ లో కొంత జాప్యం కారణంగా సైరా వేసవి కి వాయిదా పడిందని తెలిసింది. ఐతే, వేసవి కి కూడా సైరా రావడం అనుమానాలేనని కొన్నాళ్లుగా ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రచారం నిజమైనట్టు సమాచారం. సైరా వేసవికి రావడం లేదు. దసరా కానుకగా సైరాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు లెటెస్ట్ సమాచారం. దసరాకి మెగాస్టార్ రావడం ఫిక్స్ అయితే.. కొందరి హీరోలు సైడ్ కాబోతున్నారు.