సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి స్పెషల్ థాంక్స్

Entertainment Published On : Thursday, May 29, 2025 10:06 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పై అగ్ర కథానాయకుడు చిరంజీవి హర్ష వ్యక్తం చేశారు. అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికి 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అవార్డుల సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.