BREAKING: విజయ్ దేవరకొండపై కేసు నమోదు
హీరో విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ తగిలింది. లాయర్ కిషన్ చౌహాన్ ఫిర్యాదు మేరకు కేసు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆదివాసులపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారంటూ కిషన్ చౌహాన్ ఫిర్యాదులో తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.