Breaking: ప్రముఖ నటుడు కన్నుమూత
బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) నేడు తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి ఆయన మరణించినట్లు నటి దీప్ శిఖా నాగ్ పాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. `దస్తక్' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగులో కృష్ణ, కేడి, అదుర్స్, ఏక్ నిరంజన్ వంటి సినిమాల్లో విలన్ పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు.