దర్శకుడు త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన నటి..?
తెలుగమ్మాయి, నటి పూనమ్ కౌర్ మరోసారి బాంబు పేల్చింది. ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టి త్రివిక్రమ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయనీ నటి సంచలన ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు ఉందంటూ స్పష్టంగా వెల్లడించింది. సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను షేర్ చేసింది.