తమన్నాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మైసూర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను నియమించడాన్ని నటి రమ్య తప్పబట్టారు. 'మైసూర్ సోప్ అంటే కేవలం సోప్ మాత్రమే కాదు. కన్నడ ప్రజల సెంటిమెంట్. దానికి ప్రత్యేకించి బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే లోకల్ గా ఉన్న మమ్మల్ని పెట్టాలి. అంతే గానీ నార్త్ కస్టమర్ల కోసం తమన్నాను పెట్టుకోవడం సరిగ్గా అనిపించలేదు.' అని ట్వీట్ చేశారు. అయితే, తాను తమన్నాకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు.