నన్ను బట్టలు విప్పి కూర్చోమన్నాడు: నటి
బాలీవుడ్ డైరెక్టర్ సాజిత్ ఖాన్ పై సీరియల్ నటి నవీనా బోలె సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రాజెక్టు మీటింగ్ కోసం సాజిత్ ఖాన్ వద్దకు వెళ్తే బట్టలు విప్పేసి కూర్చోమన్నాడని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారిగా అర్థం కాలేదనీ తెలిపారు. అంతలోనే స్నేహితులు పిలుస్తున్నారని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయినట్లు నటి నవీనా పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన ఘటన ఎంతో కలిచివేసిందని, ఇప్పటికీ ఆ రోజును మర్చిపోలేదని ఆమె వెల్లడించారు.